జిల్లా వ్యాప్తంగా ప్రాపర్టీ నేరాల నియంత్రణ మరియు ముద్దాయిలను పట్టుకోవడంలో క్రైమ్‌లో నైపుణ్యం కలిగిన 50 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాల ఏర్పాటు
నేర తీవ్రత ఆధారంగా 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు – ప్రతి బృందానికి ప్రత్యేక బాధ్యతలు, నైపుణ్యం కలిగిన సిబ్బంది కేటాయింపు
గత ఏడు నెలల్లో 150 ప్రాపర్టీ నేరాలను ఛేదించి, 90 మంది ముద్దాయిలు అరెస్టు – దొంగతనం చేసిన సొత్తు రికవరీ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ…ప్రకాశం,మార్కాపురం జిల్లాలో దొంగతనం కేసుల నియంత్రణ మరియు కేసులు చేదించటంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ గారు తెలిపారు. జిల్లా క్రైమ్ డేటాను సమగ్రంగా విశ్లేషించి, దొంగతనాల కేసుల ఛేదన కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు, వివిధ కోణాల్లో దర్యాప్తు, నేరస్తుల కదలికలపై నిఘా, జైలు మానిటరింగ్ తదితర చర్యల ద్వారా కేసులను ఛేదించేలా పనిచేస్తాయని పేర్కొన్నారు.
ఇటీవల ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల పరిధిలో దొంగతనం కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, 90 మంది నిందితులను అరెస్టు చేసి, చోరీకి గురైన సొత్తును రికవరీ చేయడంతో పాటు సుమారు 150 కేసులను ఛేదించామని ఎస్పీ గారు తెలిపారు.అలాగే, ఇటీవల అద్దంకిలోని ఒక దేవాలయంలో జరిగిన దొంగతనం కేసును కేవలం రెండు రోజుల్లోనే ఛేదించి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. నేరాల నియంత్రణలో పోలీసుల సాంకేతిక సామర్థ్యంతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో ముఖ్యమని అన్నారు.ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో LHMS కెమెరాలను వినియోగించుకోవాలని, ఎల్ హెచ్ ఎంఎస్ పై అవగాహన కలిగి ఉండాలని, విలువైన నగదు, బంగారు ఆభరణాలు తదితర వస్తువులను బ్యాంకులో భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం. నేరాలను అరికట్టడంతో పాటు, ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు.
అద్దంకి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు
అద్దంకి పట్టణంలోని భవాని సెంటర్‌తో పాటు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యలను గుర్తించి, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన చోట్ల ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.గోపాలపురం వద్ద రహదారి సమస్యకు పరిష్కారంఅద్దంకి మండలం గోపాలపురం వద్ద గత 15 సంవత్సరాలుగా రహదారి గుంతల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు., ఐఏఎస్ గారు, ఎస్పీ గారు మరియు సంబంధిత అధికారులు పరిశీలించామన్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని, సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుని రోడ్డును వేయించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.గోపాలపురం గ్రామస్థులు చెప్పిన వేంటనే స్పందించి రోడ్డు చేసినందుకు సహకరించినందుకు ఎస్పీ గారిని, అద్దంకి సీఐ గారిని సన్మానించడం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *