తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రజా గాయకుడు సామాజిక చైతన్యమై ఎగసిన విప్లవ కెరటం ప్రజల గుండెల్లో చిరిస్మరణీయుడిగా నిలిచిన అమర గాయకుడు గద్దర్ మూడవ వర్ధంతి సభను కందుకూరు పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ కూడలి వద్ద గద్దర్ అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గద్దర్ అభిమానులు దళిత బహుజన శ్రామిక బలహీన వర్గాల ప్రజలు విప్లవ సాహిత్య సాంస్కృతిక కళాకారులు కవులు రచయితలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసినదిగా గేరా చిరంజీవి,ఉపాసక గాండ్ల.హరి ప్రసాదు, పొనుగోటి ప్రభాకర్, ముప్పవరపు కిషోర్ ఒక ప్రకటనలో కోరారు. నేడు అనగా 11 8 2026 మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి ఈ సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని గద్దర్ స్మృతికి నివాళి అర్పించవలసినదిగా ఈ ప్రకటనలో కోరారు.