యర్రగొండపాలెం సీఐ సర్కిల్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలతో క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న UI (Under Investigation) కేసులను తగ్గించి, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐలను ఆదేశించారు.అలాగే, ఎటువంటి వ్యక్తిని అనధికారికంగా లాక్‌అప్‌లో ఉంచరాదని, పోలీస్ స్టేషన్లలో ఎవరిపట్లా దురుసుగా లేదా అమానవీయంగా ప్రవర్తించకుండా, చట్టపరమైన విధివిధానాలు మరియు నిర్దేశిత మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ప్రజలకు న్యాయం, పారదర్శకమైన పోలీసింగ్ మరియు చట్టబద్ధమైన విధానాల అమలుకు పోలీసు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *