ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలు కావాలని డిమాండ్ చేస్తూ వాటిని ప్రభుత్వం త్వరిత గతిన పరిష్కరించాలని , తద్వారా ఉద్యోగులపై పని భారం తగ్గించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ఆధ్వర్యం లో మార్కాపురం పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర పట్టణం లోని అన్ని బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రపంచం లో అన్ని దేశాలలో 5 రోజుల పనిదినాలు అమలులో ఉందని, భారత దేశం లో కూడా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు కూడా వారానికి 5 రోజులు మాత్రమే పని చేస్తున్నా కేవలం బ్యాంకు ఉద్యోగులు మాత్రమే అత్యధిక పని భారంతో ,ఒత్తిడి తో వారానికి 6 రోజులు పనిచేస్తున్నారు.అన్ని ప్రభుత్వ పథకాలు బ్యాంకులు ద్వారానే అమలు చేస్తున్న ఈ డిజిటల్ యుగం లో ఇంకా 5 రోజుల పనిదినాలు కల్పించక పోవడం శోచనీయం అని బ్యాంక్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు తెలియజేశారుఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు మార్కాపురం SBI యూనియన్ నాయకులు కాశిరెడ్డి , గౌస్ భాష ,రామారావు,దిలీప్ ,గీతాంజలి, తారక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాయకులు గురవయ్య , ముంతాజ్ కరూర్ వైశ్యా బ్యాంక్ నాయకులు చైతన్య, రమణారెడ్డి హరి బాబు , ఇండియన్ బ్యాంక్ నుండి వేణు మొదలగు అన్ని బ్యాంకు ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేసినారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *