మోటార్‌సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠా అరెస్ట్
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా కంభం, బేస్తవారిపేట, మార్కాపురం, నెల్లూరు జిల్లా కావలి రూరల్, బాపట్ల జిల్లా వేటపాలెం, తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా కొండండాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో మోటార్‌సైకిళ్ల దొంగతనాలకు పాల్పడిన నేరస్తులు. చోరీ చేసిన వాహనాల నంబర్ ప్లేట్లు మార్చి, విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుబడిన ముఠా నిందితుల నుండి సుమారు 17 లక్షల విలువ కలిగిన 13 మోటార్ సైకిల్ లను స్వాధీనం.ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్, పల్సర్ మరియు నూతన హీరో కంపెనీ లకు చెందిన బైక్ లను దొంగిలించిన నేరస్తులు
ఇటీవల కాలంలో కంభం, బెస్తవారిపేట మరియు మార్కాపురం పరిసర ప్రాంతాలలో జరుగుతున్న మోటార్ సైకిల్ దొంగతనాలపై మార్కాపురం జిల్లా SP శ్రీ V. హర్షవర్ధన్ రాజు, IPS., గారు ప్రత్యేక దృష్టి సారించి వాటి దర్యాప్తు పై ప్రత్యేక సూచనలతో కూడిన ఆదేశాల జారి చేయడంతో వాటి ని అనుసరించి మార్కాపురం డిఎస్పీ U. నాగరాజు గారి పర్యవేక్షణ లో, కంభం సీఐ K. మల్లిఖార్జున గారి ఆధ్వర్యం లో కంభం యస్ఐ A. శివ కృష్ణా రెడ్డి, బెస్తవారిపేట యస్ఐ SV రవీంద్రా రెడ్డి గారు మరియు వారి సిబ్బంది కలిసి ఒక బృందంగా ఏర్పడి 14.08.2026 తేదీన కంభం గ్రామంలోని Y-జంక్షన్ వద్ద మూడు మోటార్ సైకిళ్ళపై వస్తున్న ఎనిమిది మంది వ్యక్తులు ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగిలించిన 13 బైక్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.ముద్దాయిల వివరాలు:
1)పసుపులేటి రసూల్, తండ్రి సుబ్బారావు @ సుబ్బయ్య, వయస్సు 21 సంవత్సరాలు, బృందావన గార్డెన్స్ కాలనీ, బేస్తవారిపేట.
2)బత్తుల శ్రీహరి, తండ్రి రాజు, వయస్సు 20 సంవత్సరాలు, దత్తకొండ కాలనీ, బేస్తవారిపేట.
3)బత్తుల శ్రీను, తండ్రి రాజు, వయస్సు 20 సంవత్సరాలు, దత్తకొండ కాలనీ, బేస్తవారిపేట.
4)అన్నేబోయిన అఖిల్ కుమార్, తండ్రి చంద్రశేఖర్, వయస్సు 20 సంవత్సరాలు, BC కాలనీ, బేస్తవారిపేట.
5)శ్రీరామ్ ప్రసన్నకుమార్, తండ్రి మాధవరావు, వయస్సు 22 సంవత్సరాలు, పాపాయిపల్లి గ్రామం, బేస్తవారిపేట మండలం.
6)దూదేకుల బాబు, తండ్రి మస్తాన్, వయస్సు 37 సంవత్సరాలు, BC కాలనీ, బేస్తవారిపేట.
7)జూటూరి ఇమ్మానుయేల్, తండ్రి యేసు, వయస్సు 24 సంవత్సరాలు, 10వ వార్డు, రాజ్యలక్ష్మి కాలనీ, మార్కాపురం.
8)దూదేకుల సాదిక్, తండ్రి రహీం సాహెబ్, వయస్సు 27 సంవత్సరాలు, పుచ్చకాయలపల్లి, పెద్దారవీడు మండలం, ప్రస్తుతం 10వ వార్డు, రాజ్యలక్ష్మి కాలనీ, మార్కాపురం.ముద్దాయిల నేరాలకు పాల్పడిన ప్రదేశాలు
కంభం పోలీస్ స్టేషన్ పరిధి లో 3 బైక్ లు
బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ పరిధి లో 3 బైక్ లు
మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో 4 బైక్ లు
నెల్లూరు జిల్లా కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి లో 1 బైక్
బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధి లో 1 బైక్
తెలంగాణ రాష్ట్రం జోగులంభా గద్వాల్ జిల్లా కొదండాపురం (FCR) పోలీస్ స్టేషన్ పరిధి లో 1 బైక్ నేర విధానం:ముద్దాయిలు మొదట స్నేహితులుగా ఏర్పడి, మద్యం తదితర వ్యసనాలకు అలవాటు పడిన తరువాత సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోటార్ సైకిళ్ళను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు.పార్కింగ్ చేసిన మోటార్ సైకిళ్ళను గమనించి, వాటి సైడ్ లాక్ విరగ గొట్టి అక్కడి నుండి కొద్దిదూరం నెట్టుకొని వెళ్లి వైర్లను కనెక్ట్ చేసి స్టార్ట్ చేసుకొని వెళ్ళతారు, అనంతరం వాహనాలను బేస్తవారిపేట దత్తకొండ మరియు మార్కాపురంలో వాటిని దాచేవారు.ఈ విధంగా తేదీ 04.02.2026 నుండి 13.08.2026 వరకు వివిధ ప్రాంతాలలో మొత్తం 13 మోటార్ సైకిళ్ళను దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడైంది. చోరి చేసిన వాహనాలలో మూడు మోటార్ సైకిళ్ళను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయించేందుకు తీసుకువెళ్తున్న సమయంలో కంభం Y-జంక్షన్ వద్ద పోలీసుల వాహన తనిఖీలో పట్టుబడగా, మిగిలిన 10 వాహనాలను వారి చూపిన ప్రదేశాల నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పై ఎనిమిది మంది ముద్దాయిలను 14.08.2026 న అరెస్ట్ చేసి, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం 13 మోటార్ సైకిళ్ళను సంబంధిత పోలీస్ స్టేషన్ల కేసులలో చోరి సొత్తుగా గుర్తించి, తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది.పై కేసులను త్వరితగతిన ఛేదించి, 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 13 మోటార్ సైకిల్ దొంగతనం కేసులను గుర్తించి, 13 చోరి మోటార్ సైకిళ్ళను రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన కంభం సర్కిల్ K. మల్లిఖార్జున,కంభం యస్ ఐ A. శివ కృష్ణా రెడ్డి, బెస్తవారిపేట యస్ ఐ SV రవీంద్ర రెడ్డిమరియు సిబ్బంది కంభం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ లు వెంకటేశ్వర్లు, రంగస్వామి, హోమ్ గార్డ్ లు లాజర్, పాపారావు, అశోక్, వెంకట రమణ లను, బెస్తవారిపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అంకయ్య, వెంకటేష్ లను మార్కాపురం జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
