టంగుటూరు డిప్యూటీ తహసిల్దార్ శ్రీనాథ్ కు
మెమో రాండం
ఏపీ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం (ఐయఫ్ టి యు) ఆధ్వర్యంలో
భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా అమలు చేయాలని, గతంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలైన 14 సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం( ఐ ఎఫ్ టి యు అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఆర్.మోహన్ డిమాండ్ చేశారు
సోమవారం టంగుటూరు మండలం తాసిల్దార్ కార్యాలయం నందు డిప్యూటీ తహసిల్దార్ శ్రీనాథ్ గారికి గారికి ఏపీ ప్రగతిల భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం( ఐ ఎఫ్ టి యు అనుబంధం) ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు, ఈ సందర్భంగా కామ్రేడ్ ఆర్ మోహన్ మాట్లాడుతూ భ వన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని, భవన నిర్మాణ కార్మికులకు 14 సంక్షేమ పథకాల అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను మోసం చేసిందని, కార్మికుల పోరాటం ఫలితంగా మార్చి 1వ తేదీ విడుదల చేసిన సర్క్యులర్ లొ 14 సంక్షేమ పథకాల అమలు చేయాల్సి ఉండగా కేవలం మూడు సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు, ప్రధానమైన భవనిర్మాణ కార్మికుల ప్రమాద భీమాను, ప్రమాదం జరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే హాస్పిట లై జేషన్ అలవెన్స్ ను ఆ సర్కులర్ లొ పేర్కొనలేదని. అందువలన ప్రభుత్వం వెంటనే స్పందించి భవన నిర్మాణ కార్మికులకు ప్రధానమైన “ప్రమాద బీమాను” అమలు చేయాలని డిమాండ్ చేశారు, ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 31వ తేదీ విజయవాడ లేబర్ కమిషనర్ కార్యాలయం జరుగు ధర్నాని జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి కామ్రేడ్ ఆర్, మోహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ప్రగతిశీ ల భవన మరియు ఇత ర నిర్మాణకార్మికుల సంఘం (ఐయఫ్ టి యు )జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సిహెచ్,రంగారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు గత 12 సంవత్సరాల్లో 5,187 కోట్ల రూపాయలు వసూలు సెస్ చేయగా 1500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రద్దు చేసి కార్మికులకు ద్రోహం చేసిందని, నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడాకంటి తుడుపుగా మూడు సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు ప్రకటించి కార్మికులకు అన్యాయం చేసిందని ఆగ్రహం తీశారు. 14 సంక్షేమ పథకాలు అమలు చేయని యెడల భవన నిర్మాణ కార్మికుల ఆగ్రహానికి గురికా తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు , ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ టి వెంకట్రావు. జిల్లా నాయకులు సిహెచ్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *