తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
కనుమళ్ళ గ్రామ శివారులో జూదం ఆడుతున్న ముగ్గురిని పట్టుకున్న పోలీసులు – రూ.7,600 నగదు, ప్లేయింగ్ కార్డులు స్వాధీనం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీసులు కనుమళ్ళ గ్రామ శివారులో జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి జూదానికి ఉపయోగిస్తున్న రూ.7,600 నగదు మరియు ప్లేయింగ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.