తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:
పట్టణంలోని నటరాజ్ సెంటర్ వద్ద తప్పిపోయి తిరుగుతున్న ఇద్దరు చిన్నారులను స్థానికులు గుర్తించి మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. చిన్నారుల వివరాలు, ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో ప్రచారం చేసి వారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడం, అదేవిధంగా పిల్లల ద్వారా తల్లిదండ్రుల అడ్రస్సును పోలీసులు సేకరించడం . అనంతరం తల్లిదండ్రిని పిలిపించి చిన్నారులను వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. తక్షణమే స్పందించి చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డిని సిబ్బందిని తల్లిదండ్రులు, పలువురు అభినందించారు..