తొలి శుభోదయం న్యూస్ కంభం:-
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందుగల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు మిలాదున్ నబీ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి అయిన అబ్దుల్ సత్తార్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ప్రవక్త గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకుంటారని, అదేవిధంగా ఈ పండగ యొక్క పూర్వకథ వృత్తాంతం మొత్తాన్ని మరియు ప్రవక్త గారి యొక్క జీవితపైన విధానాన్ని విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించడం జరిగినది. ఎల్లప్పుడూ విద్యార్థులు సత్యాన్ని పలకాలని సత్యం మాత్రమే మనని ఉత్తమ శిఖరాలకు చేరుస్తుందని తెలపడం జరిగినది. అదేవిధంగా పాఠశాల విద్యా వ్యవస్థనుండే విద్యార్థులకు భారతదేశ అన్ని మతాల యొక్క ఆచార వ్యవహారాలను తెలుపుతూ విద్యతో పాటుగా అన్ని రంగాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించడంలో బలమైన భావి భారతాన్ని నిర్మించవచ్చని ఆయన తెలపడం జరిగినది. అనంతరం విద్యార్థులతో కలిసి కేకులు కట్ చేసి విద్యార్థులకు తినిపించడం జరిగినది. అనంతరం విద్యార్థులకు చదువుతోపాటు చేతిరాత క్లాసులు, కరాటే, స్పోకెన్ ఇంగ్లీష్, శారీరక దారుధ్యానికి ఆటలు తోపాటు అనేక సంస్కృతి కార్యక్రమాలతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నందుకు కృష్ణవేణి విద్యాసంస్థలను అభినందించడం జరిగినది. అనంతరం పాఠశాల అడ్మిన్ మరియు అధ్యాపక బృందం విద్యాశాఖ అధికారి గారిని శాలువాతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు చురుకుగా పాల్గొన్నారు.