కందుకూరులో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన నాగేశ్వరరావు
ఇంటర్వ్యూలు నిర్వహించిన 20కి పైగా కంపెనీలు
హాజరైన 300 మందికి పైగా నిరుద్యోగులు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కందుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించగా….. గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. MLA నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ….ఎన్నికలకు ముందు మాట ఇచ్చినట్లుగా… కందుకూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాను. రామాయపట్నం పోర్టు, లక్ష కోట్ల పెట్టుబడితో రాబోతున్న BPCL, 50వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఇండోసోల్, ఇంకా జిందాల్ స్టీల్ వంటి కంపెనీలు త్వరలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. ఒక్కో కంపెనీ ద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయి. మన దగ్గర చదువుకున్న వారికి, ఇక్కడే ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి.
దేశంలో కొత్తగా ఏర్పాటు అవుతున్న పరిశ్రమల్లో, 27 శాతం మన రాష్ట్రానికే వస్తున్నాయి. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నాయకులు లోకేష్ కృషితోనే సాధ్యమవుతోంది. నిరుద్యోగులకు భరోసా కల్పించి, వారి భవిష్యత్తును బంగారుమయం చేసేలా వారు కష్టపడుతున్నారు. ప్రతి కుటుంబంలో చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లిదండ్రుల కలలు నెరవేర్చేలా విద్యార్థులు, యువత కష్టపడాలి. ఒక లక్ష్యంతో చదివి, అనుకున్నది సాధించాలి. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలలో 3 నెలలపాటు శిక్షణ పొందండి. కంపెనీలు కోరుకుంటున్నట్లుగా కోర్సులలో శిక్షణ ఇస్తారు. శిక్షణలో చేరేవారికి, మండల కేంద్రాల నుంచి ఇక్కడికి నేరుగా బస్సు వసతి ఏర్పాటు చేస్తాను. గత ప్రభుత్వంలో యువతకు శిక్షణ లేదు, ఉద్యోగాలు లేవు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటుచేసిన శిక్షణ కేంద్రాలను పట్టించుకోలేదు. కందుకూరులో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడి కేంద్రంలో కంప్యూటర్లు బాగు చేయించి, ఇతర వసతులు కల్పించాను. యువత సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. సుమారు 300 మందికి పైగా నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనగా… 20కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ రియాజుద్దీన్, ఐటిఐ కాలేజీ ప్రిన్సిపల్ ఎంవీ నాగేశ్వరరావు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆచార్య, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షులు అల్లం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీను, పట్టణ ఉపాధ్యక్షుడు షేక్ సలాం, పట్టణ బిజెపి అధ్యక్షుడు కళ్యాణ్, టిడిపి నాయకులు అత్తంటి శ్రీహరినాయుడు, ముప్పవరపు వేణు, నల్లూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.