పటిష్ట బందోబస్తు నిర్వహణపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ఈ నెల 31వ తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దోర్నాల మండలం, గంటావానిపాలెం వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారు బందోబస్తు విధుల్లో పాల్గొనబోయే పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించి బందోబస్తు విధులపై దిశా నిర్దేశం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభం నుండి ముగిసింతవరకు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు.నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక నంబర్లు, ప్రత్యేక స్టిక్కర్లు, ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు, వాటి ఆధారంగా వాహనాలను కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాలు వచ్చే మార్గాల్లో, తిరిగి వెళ్లే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వీఐపీ/వీవీఐపీలకు సంబంధించిన వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా చూడాలని సూచించారు.సిబ్బందికి కేటాయించిన ప్రదేశాల్లో నిర్దేశించిన సమయానికి విధులకు హాజరై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. అదేవిధంగా, డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.విధులు నిర్వహించే సిబ్బంది సమయస్పూర్తితో వ్యవహరించాలని, బయట నుండి వచ్చే వాహనాలు కేటాయించిన స్థలాలలోనే పార్కింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.అనంతరం దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతం నుండి జల హారతి జరిగే ప్రదేశం, పైలాన్, గేట్లు, బహిరంగ సభా స్థలం వరకు కాన్వాయ్ ట్రయల్ రన్ ను ప్రత్యేకంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ వచ్చేటప్పుడు బందోబస్త్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, కాన్వాయ్ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం పూర్తయ్యేంత వరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా క్రమపద్ధతిలో బందోబస్త్ నిర్వహిస్తూ సీఎం పర్యటనను విజయవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి గారి మార్కాపురం జిల్లా పర్యటనకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ బందోబస్తు నిమిత్తం 1800 మందిని కేటాయించామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.