టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కందుకూరు పూర్వ విద్యార్థి, ప్రస్తుతం IIITDM కాంచీపురం డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ మాచవరం వెంకట కార్తీకేయన్ గారు తన డైరెక్టర్ బాధ్యతల నుండి 27 ఆగస్టు 2026న వైదొలగి, అనంతరం తన మాతృ సంస్థ అయిన ఐఐటీ రూర్కీలో ఈ నెలాఖరున, అనగా 31 ఆగస్టు 2026న అధికారికంగా పదవీ విరమణ పొందనున్నారు.ప్రొఫెసర్ కార్తీకేయన్ గారు తమ విద్యాభ్యాసాన్ని కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేసి, స్వయంకృషి, పట్టుదలతో సాంకేతిక విద్యా రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.ఆయన ప్రతిష్టాత్మక ఐఐటీ రూర్కీలో ప్రొఫెసర్‌గా విశిష్ట సేవలందించారు. ఐఐటీ తిరుపతికి తమ విలువైన సేవలను అందించారు. IIIT శ్రీ సిటీకి ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు మరియు ప్రస్తుతం IIITDM కాంచీపురంకు డైరెక్టర్‌గా దూరదృష్టితో నాయకత్వం వహిస్తున్నారు.
మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రస్థానం విద్యా ప్రతిభకు, సంస్థాగత నిర్మాణానికి నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి కూడా దేశంలోని అత్యున్నత సాంకేతిక సంస్థలకు నాయకత్వం వహించగలడని ఆయన నిరూపించారు.ఈ సందర్భంగా టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది, విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థుల తరపున ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కార్తీకేయన్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయనకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన పదవీ విరమణ జీవితాన్ని ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *