తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
రాత్రివేళల్లో విస్తృతంగా పోలీసుల గస్తీ – ప్రజల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రాత్రి వేళల్లో నైట్ బీట్ నిర్వహిస్తూ శాంతిభద్రతలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, అనుమానాస్పద ప్రాంతాలు మరియు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా గస్తీ నిర్వహిస్తున్నారు.అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, నేరాల నివారణ, ప్రజలకు భద్రతా భావన కల్పించడం, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలపై నిఘా ఉంచడం వంటి చర్యలను పోలీసులు చేపడుతున్నారు.ప్రజల భద్రతే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు రాత్రింబవళ్లు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.