జాతీయ రహదారిపై ఉలవపాడు మండలం కె. రాజుపాలెం అడ్డరోడ్డు వద్ద దాతలు ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ప్రయాణికులకు స్వయంగా మజ్జిగ అందించారు. ఈ సందర్భంగా దాత, కె. రాజుపాలెం గ్రామ టిడిపి నాయకుడు కందలగడ్డ సాయి వరుణ్ ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఉలవపాడు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి కి రాజుపాలెం అడ్డరోడ్డు వద్ద ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల టిడిపి అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు మంత్రి గారిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మద్దసాని మహేంద్ర, పార్టీ నాయకులు మార్టూరి కోటేశ్వరరావు, చలపతి, నారాయణరాజు, రాచగర్ల శివ, అమ్మనబ్రోలు రమేష్, అమ్మనబ్రోలు కిరణ్, పుల్లా వెంకట్, వాసు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *