ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీయస్.ఆదేశాల మేరకు, జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా, టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జ్ సిఐ భీమా నాయక్ పర్యవేక్షణలో ఆదివారం టంగుటూరు పట్టణంలోని పురం సెంటర్లో ఉన్న రెండు బెల్ట్ షాపుపై ఒంగోలు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 56 (180ML) మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద 46 వాటర్ బాటిల్స్, ఒక ఆడ మనిషి వద్ద 10 క్వార్టర్ బాటిల్స్ స్వాధీన పరుచుకుని తదుపరి చర్యల నిమిత్తం టంగుటూరు పోలీస్ స్టేషన్‌లో అప్పగించడం జరిగింది.పట్టుబడిన మద్యం బాటిళ్లను, ఇద్దరిని టంగుటూరు పోలీసులకు అప్పగించగా, ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అక్రమ మద్యం విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఎస్సై చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్ భాషా మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *