కందుకూరులో జరిగిన 34వ విడత CMRF పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. 39 మంది లబ్ధిదారులకు రూ. 35.37 లక్షల విలువైన చెక్కులను నా చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఇప్పటివరకు మన నియోజకవర్గంలో 1279 మందికి రూ. 10 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించాం. అలాగే అత్యవసర వైద్యం కోసం 87 మందికి LOC ద్వారా రూ. 2 కోట్లకు పైగా మంజూరు చేశాం. ప్రతి ఆపదలోనూ ప్రజలకు అండగా నిలుస్తూ.. CMRF పంపిణీలో ప్రకాశం జిల్లాలోనే కందుకూరు రెండవ స్థానంలో నిలవడం మన పనితీరుకు నిదర్శనం.
మండలాల వారీగా అందించిన సాయం వివరాలు:
📍 కందుకూరు పట్టణం: 9 మందికి – ₹11,99,829/-
📍 కందుకూరు రూరల్: 3 మందికి – ₹8,72,278/-
📍 ఉలవపాడు: 10 మందికి – ₹8,35,031/-
📍 వలేటివారిపాలెం: 8 మందికి – ₹2,87,280/-
📍 లింగసముద్రం: 5 మందికి – ₹1,79,919/-
📍 గుడ్లూరు: 4 మందికి – ₹1,63,537/-
నాడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుంచి.. నేడు వేల కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామంటే, అది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అద్భుత దార్శనికతే కారణం. ఈరోజు సాయం అందుకున్న లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మనస్సుకు ఎంతో సంతృప్తిగా అనిపించింది. గడపగడపకూ సంక్షేమం అందించే దిశగా మన అడుగులు ఇలాగే కొనసాగుతాయి…

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *