2025-26 జరిగిన ఎస్‌ఎస్‌సి (SSC) పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినందుకు కలెక్టర్ గారిచే అభినందనలు అందుకున్న బెస్తవారి పేట టాపర్ 589/600 సాధించిన షేక్ వాహిద D/O షేక్ నాయబ్ రసూల్ మరియు కంభం టాపర్ 582/600 సాధించిన షేక్ రజియా సుల్తానా D /O షేక్ అబ్దుల్ ఖాదర్ విద్యార్దులను మా ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తు 5000/- రూపాయల నగదు, మక్న మరియు ఫైల్ అందజేశారు. పరిమిత వనరుల మధ్య కృషి చేసి మంచి మార్కులు సాధించిన ఈ విద్యార్థులు నిజంగా ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.ఈ విజయానికి కారణమైన విద్యార్థుల కఠోర శ్రమతో పాటు, వారికి మార్గదర్శకత్వం అందించిన ఉపాధ్యాయులు, సహకరించిన తల్లిదండ్రుల పాత్ర అమూల్యం. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నత స్థాయి విద్యను అందిస్తున్నాయని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడం ఎంతో ఆనందదాయకం. భవిష్యత్తులో కూడా ఈ విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ, వారికి ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ వారు శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో P. ఆసిఫ్ ఖాన్(AIITA జిల్లా అధ్యక్షులు), S.MD. రఫీ (మాజీ AIITA అధ్యక్షులు), P. గౌస్ ఖాన్ (JIH సౌత్ మార్కాపురం జిల్లా అధ్యక్షులు), Sk. నాయబ్ రసూల్ (ఉర్దూ లెక్చరర్), P. ఇక్బాల్ బాషా (ఉర్దూ పండిట్),హాజీ సయ్యద్ అబ్దుల్ జలీల్(RTD టీచర్), రసూల్ బేగ్(RTD టీచర్), పి. మన్సూర్ హిదాయతుల్లా ఖాన్(డిగ్రీ కాలేజీ లెక్చరర్), చాంద్ బాషా (Regional organizer, SIO Costal Andhra) , P. రసూల్ ఖాన్( JIH బెస్తవారిపేట), విద్యార్ధినుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *