పెండింగ్ మరియు విచారణలో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో వై.పాలెం సీఐ గారు సర్కిల్ పరిధిలోని ఎస్సైలతో కలిసి క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలో విచారణలో ఉన్న అన్ని కేసుల పురోగతిని సమీక్షించి, దర్యాప్తు స్థితిగతులను అధికారుల నుండి తెలుసుకున్నారు. ప్రతి కేసును చట్ట ప్రకారం సమగ్రంగా విచారించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి కేసులను సకాలంలో పరిష్కరించేందుకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.నేరాల నియంత్రణ, నిందితుల అరెస్ట్, చార్జిషీట్ల దాఖలు, పెండింగ్ కేసుల తగ్గింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు న్యాయం అందించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి కేసును బాధ్యతాయుతంగా విచారించి సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని అధికారులకు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *