తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:-
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల టిడిపి జోనల్ కో ఆర్డినేటర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఒంగోలు టిడిపి పార్లమెంటు అధ్యక్షులు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించారు.