తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ రేపు అనగా 18.05.2026 (సోమవారం) ఉదయం 10:00గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కందుకూరు నియోజకవర్గం లో నిరసన కార్యక్రమము జరుగుతుంది.
రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకర విషయం. ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి, దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధిక ధరలకు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ను విక్రయించడం జరుగుతోంది.ఇప్పుడు తగ్గించడం బదులు మరింతగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై భారీ భారం మోపడంతో పాటు, రైతాంగం మరియు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులైన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్ లతోపాటుగా వివిధ స్థాయి పదవులను అలంకరించిన రాష్ట్ర, జిల్లా,మండల, పట్టణ, గ్రామ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, అభిమానులతోపాటు ప్రజలు ప్రజాస్వామికవాదులు పెట్రోల్ డీజిల్ పెంపును నిరసిస్తున్న అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.