తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా తక్షణం పరిష్కారం అయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు.
లో వోల్టేజ్, కరెంటు స్తంభాలు, తీగలు వాలిపోవడం వంటి విద్యుత్ సమస్యలపై స్యలపై వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు.పార్కుల నిర్వహణ, డ్రైనేజీల శుభ్రత, వీధి దీపాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు.రెవెన్యూ సమస్యలు, పొలం పాస్‌బుక్స్, సర్వేలు వంటి అంశాలపై నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని, ప్రజలు చిన్న చిన్న సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా తమను సంప్రదించాలని డాక్టర్ లక్ష్మీ తెలిపారు.