తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్న మార్కాపురం జిల్లా పోలీసులు ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్ కింద కనిగిరి ప్రాంతంలో డ్రోన్ పర్యవేక్షణ చేపట్టారు.డ్రోన్ కెమెరాల సహాయంతో జనసమ్మర్థ ప్రాంతాలు, కీలక ప్రదేశాలు, ట్రాఫిక్ పరిస్థితులు మరియు అనుమానాస్పద కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.
ప్రజల భద్రత కోసం ఇలాంటి టెక్నాలజీ ఆధారిత నిఘా చర్యలు కొనసాగుతాయని మార్కాపురం జిల్లా పోలీసులు తెలిపారు.