తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేయడం, కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.అలాగే రానున్న రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి బలోపేతం మరియు ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే అంశాలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.