కొండపి నియోజకవర్గంలోని పాకల, ఊళ్లపాలెం మత్స్యకార గ్రామాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మంగళవారం పర్యటించారు. వేట నిషేధ భృతి నిధుల విడుదలతో మత్స్యకారుల ఆనందోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని మంత్రి వివరించారు. మంత్రి డా.స్వామి మాట్లాడుతూ….ఎన్నికల్లో చెప్పిన మాటకు కట్టుబడి మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఆర్థిక భరోసా ఇస్తున్నాం. మత్స్యకారుల సేవలో పథకంతో 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్లు లబ్ధి చేకూరింది. మత్స్యకారులకు 60 శాతం సబ్సిడీతో మెకనైజ్డ్ బోట్లు ఇస్తాం. పొరుగు రాష్ట్రాల బోట్లు మన జలాల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటాం. జువ్వలదిన్నెలో రూ.288 కోట్లలో షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తున్నాం, 87% పనులు పూర్తయ్యాయి. షిప్పింగ్ హార్బర్ పూర్తి చేసి మత్స్యకారుల జీవితాల్లో సీఎం చంద్రబాబు నాయుడు వెలుగులు నింపేందుకు కంకణం కట్టుకున్నారు. మత్స్యకారులకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *