ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పాత పోలీస్ క్వార్టర్స్‌ను తొలగించి చదును చేసిన ఖాళీ స్థలాన్ని ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి , మరియు జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., , గురువారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పిల్లలు సమ్మర్ క్యాంపును పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ పరిసర ప్రాంత అభివృద్ధికి చేపట్టనున్న ప్రణాళికల గురించి జిల్లా ఎస్పీ , ఎంపీ ,కి వివరించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని పోలీస్ సిబ్బంది సంక్షేమం కొరకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు.ఆ ప్రదేశంలో టెన్నిస్ కోర్ట్, వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్ట్, క్రికెట్ ఆడుకునే మైదానం, విశాలమైన గ్రౌండ్‌తో పాటు అందమైన ఉద్యానవనం ఏర్పాటు చేయుటకు అనుకూలంగా ఉన్నాయన్నారు. పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి , ఈ అభివృద్ధి కార్యక్రమాలు పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, మానసిక ఉల్లాసం మరియు శారీరక దృఢత్వానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రాంగణంలో నిర్వహిస్తున్న పిల్లల సమ్మర్ క్యాంప్‌ను ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి , పరిశీలించారు. చిన్నారులకు హాయ్ చెబుతూ ఉత్సాహపరిచారు. పిల్లలు వివిధ క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటున్న తీరును అభినందించారు. విద్యతో పాటు క్రీడలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు కూడా పిల్లల భవిష్యత్తుకు ఎంతో అవసరమన్నారు.పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధునిక వసతులు కల్పించేందుకు అవసరమైన తన వంతు సహకారం అందిస్తామని, పోలీస్ కార్యాలయ ప్రాంగణాన్ని మరింత సుందరంగా, ఉపయోగకరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న కార్యక్రమాలకు పూర్తి సహకారం అందజేస్తామన్నారు.జిల్లా ఎస్పీ , మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణతో పాటు శారీరక వ్యాయామం, క్రీడలు మరియు ప్రశాంత వాతావరణం ఎంతో అవసరమని, అందుకు అనుగుణంగా ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఐ సీతారామరెడ్డి, ఎఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *