గిద్దలూరు పట్టణంలోని కొండపేట మసీద్ ఏ అబుల్ కసిం లో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా జమాలుద్దీన్ రషీద్ బక్రీద్ పర్వదిన ప్రాముఖ్యతను వివరించారు.
అల్లాహ్ ఆజ్ఞకు లోబడటం, త్యాగస్ఫూర్తి, సహనం మరియు పరస్పర సహకారం బక్రీద్ పండుగ ప్రధాన సందేశాలని ఆయన తెలిపారు. బక్రీద్ పండగ త్యాగాలకు ప్రత్యేకగా నిలిచే పండగ.ప్రతి ముస్లిం సోదరుడు సమాజ సేవాభావంతో ముందుకు సాగాలని, పేదలకు సహాయం చేయడం ద్వారా పండుగ యొక్క అసలు ఉద్దేశ్యం నెరవేరుతుందని పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికి ఒకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *