తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
పట్టణంలోని పామూరు రోడ్ లో ఉన్న27.వ వేలం కేంద్రం లో గిట్టుబాటు ధరలు కల్పించాలని బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన ను పొగాకు రైతులు వ్యక్తం చేశారు. వలేటివారిపాలెం మండలంలోని చుండి క్లస్టర్ నుంచి 715 పొగాకు బేళ్ళు ను రైతులు అమ్మకానికి నిమిత్తము తీసుకొచ్చారు. వేలం ప్రారంభమైన కొద్దిసేపటికి రైతులు కొనుగోళ్ళు నునిలిపి వేశారు. 406పొగాకు బేళ్ళు నుకొనుగోలు చేశారు. గరిష్ట ధర 250, కనిస్టు ధర 180, దారాసరి ధర 2o9.33 పైసలు పలికిందన్నానీ ఏఎస్ శ్రీనివాసన్ తెలిపారు. ఎన్ భీలు 243 పొగాకు బేళ్ళు చెప్పారు. ఏ ఎస్ రైతులు, రైతు నాయకులు తో చర్చలు జరిపారు. అనంతరం కొనుగోలు జరిగాయని ఆయన తెలియజేశారు.