మార్కాపురం పట్టణంలోని కొండారెడ్డి కాలనీ, సిఎస్ పురం మండలంలోని ఎస్టీ కాలనీ, విరాట్ నగర్, అలాగే బీవీ పేట మండలంలోని నేకునంబాడ్ గ్రామం వంటి పలు ప్రాంతాల్లో పోలీసులు సమన్వయంతో ఈ ఆపరేషన్లు చేపట్టారు. యర్రగొండపాలెం సర్కిల్ పరిధిలోని భవాని కాలనీలో సీఐ గారి ఆదేశాల మేరకు ఎస్ఐలు మరియు సిబ్బంది కలిసి కార్డన్ & సెర్చ్ నిర్వహించారు.ఈ తనిఖీలలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించడంతో పాటు, వాహనాల పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పత్రాలు లేని 21 మోటార్ సైకిళ్లు బీవీ పేట మండలంలో స్వాధీనం చేసుకోగా, యర్రగొండపాలెం ప్రాంతంలో 7 మోటార్ సైకిళ్లు మరియు 1 ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, 53 మంది వ్యక్తుల వేలిముద్రలను FINS పరికరం ద్వారా పరిశీలించారు.ఈ ఆపరేషన్ల ద్వారా నేరస్తుల కదలికలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచడమే కాకుండా, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు కలిగి ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.
ప్రకాశం జిల్లా పోలీసుల ఈ సమగ్ర చర్యలు నేరాల నియంత్రణలో కీలకంగా నిలుస్తున్నాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *