ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో JDBM టౌన్ బాప్టిస్ట్ చర్చి దగ్గర మజ్జిగ పంపిణీ.
ఈ సందర్భంగా సేవాసమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ తీవ్రమైన ఎండలు భరించలేని ఉష్ణోగ్రతల మధ్య రోడ్డుపై నిస్సహాయంగా నడుస్తున్న యాచకులకు, బాటసారులకు, చిన్నారులకు, దివ్యాంగులకు, చమటతో తడుస్తూ కష్టపడుతున్న శ్రామికులకు, దాహంతో అలమటిస్తున్న సామాన్య ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన ప్రేమ సేవ తత్వాలను ఊపిరిగా చేసుకొని సమాజంలో నిరంతరం అభాగ్యులకు తోడుగా నిలిచే జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆదివారం దాతల సహకారంతో చల్లని మజ్జిగ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ బాబు, మైత్రి నితీష్ వేణుబాబు, శివ, చరణ్ తేజ, తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *