గిద్దలూరు నియోజకవర్గం, క్రిష్ణంశెట్టి పల్లి పంచాయతీ పరిధిలోని పెద్దచెరువు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని గౌ ” ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి , రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరియు చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ, వారి ఆరోగ్య సంరక్షణలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నూతన భవన నిర్మాణంతో స్థానిక పిల్లలకు, తల్లులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటుగా మండల నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు పెద్దచెరువు గ్రామ ప్రజలు తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *