కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారాలు మోపుతోందని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు.సింగరాయకొండ చేపల మార్కెట్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహిస్తూ నిరసన తెలిపారు. “ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి”, “పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి” అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల విభాగాల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *