పెట్రో ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా చంద్రబాబు నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం ప్రజలపై పెట్రో భారం రూ.3,391 కోట్లు మోపిందని తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక ధర అమలవుతుందని అన్నారు.తాజా పెంపుతో రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌ రూ.113.62, లీటర్‌ డీజిల్‌ రూ.101.24కు చేరింది.చంద్రబాబు ప్రభుత్వం మరో ‘బాదుడే బాదుడు’ మొదలుపెట్టింది. సూపర్‌సిక్స్‌ తరహాలో మరో మోసంతో పచ్చి దగా చేస్తోంది.
అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి, అన్నింటిలాగే ఆ విషయాన్ని కూడా గాలికొదిలేసి చంద్రబాబు ‘మరో మోసానికి తెర తీశారని విమర్శించారు.
– ఒకవైపు సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు లేవు. గతంలో జగనన్న ప్రభుత్వంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేయడమే కాకుండా, ఇప్పుడు ఈ తరహా పెట్రో బాదుడే బాదుడుతో వాహనదారులతో పాటు, ప్రజల నడ్డి కూటమి ప్రభుత్వం విరుస్తోంది.రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) ఎక్కువగా ఉండటంతో, దేశం మొత్తం మీద ఇక్కడే పెట్రోల్, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరల వల్ల అధిక భారం రాష్ట్రంలోని రైతులు చిన్న సన్న కారు వ్యాపారస్తులు మధ్య తరగతి ప్రజలు వాహనదారులపై భారం పడుతుంది. ఎన్నికల ముందు చంద్రబాబు, నారా లోకేష్‌ తగ్గిస్తామని ఊదరగొట్టి, ప్రజలను నమ్మించేందుకు మ్యానిఫెస్టోలో కూడా పెట్టి ఇక్కడా మాట తప్పారు. ఇప్పుడు పన్ను తగ్గింపుల ఊసేఎత్తడంలేదు.చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, ఇతర బాదుడు తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం అని అన్నారు. స్థానిక శాసనసభ్యులు అయితే ప్రజా సమస్యలను పరిష్కరించటం మానేసి అవినీతి అక్రమ దందాల్లో మునిగితేలుతున్నారని ఇసుక మట్టి మాఫియా రేషన్ దందాలతో పాటు ఎంతో పవిత్రమైన శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో కూడా తన బినామీయుల ద్వారా దందాలు నిర్వహిస్తున్నారని అని తీవ్రంగా విమర్శించారు గతంలో నేను చెప్పిన విధంగానే మహిమ గల దేవునితో ఇటువంటి ఆటలు ఆడ వద్దని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నానని అన్నారు ఇప్పటికైనా నియోజకవర్గంలో పెరిగిన ధరలను అదుపు చేసే విధంగా ఆలోచించి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలని అన్నారు అంతేగాని ప్రజల సమస్యల పైన నిరసన తెలియజేస్తున్న ప్రతిపక్షాన్ని పోలీసులు ద్వారా గొంతు నొక్కాలని చూడటం శాసనసభ్యులకు తగదని హితవు పలికారు. అనంతరం సబ్ కలెక్టర్ మహిమ వంశీ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి మా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అదేవిధంగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయటానికి కనీసం నీడ కోసం టెంట్ కూడా వేసుకోనికుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును సరిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, జిల్లా జనరల్ సెక్రెటరీ తోకల కొండయ్య,రాష్ట్ర బూత్ జాయింట్ సెక్రెటరీ గణేశం గంగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్, కందుకూరు మండల అధ్యక్షులు ఈదర రమేష్, ఉలవపాడు మండల అధ్యక్షులు నన్నం పోతురాజు వలేటివారిపాలెం మండల అధ్యక్షులు అనుమూల లక్ష్మి నరసింహ, లింగసముద్రం మండల అధ్యక్షులు నోటి వెంకటేశ్వర్ రెడ్డి లింగసముద్రం ఎంపీపీ వెన్న కృష్ణయ్య, జిల్లా సెక్రెటరీ చీమల వెంకటరాజా, రాష్ట్ర కల్చరల్ విభాగం అధికార ప్రతినిధి వల్లూరి కోటేశ్వరరావు, జిల్లా ఎస్సీ సెల్ సెక్రెటరీ గేరా.మనోహర్,జిల్లా మున్సిపల్ వింగ్ సెక్రెటరీ నగల్ల నారయ్య, క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉచ్చులూరి రవీంద్ర, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు చనమాల కోటేశ్వరరావు, ఎస్సీ సెల్ పట్టణ ఉపాధ్యక్షులు తొండల ఆదాము, మైనారిటీ అధ్యక్షులు షేక్ రహీం, సీనియర్ నాయకులు ఉప్పుటూరి నాగేశ్వరరావు, రైతు సంఘం అధ్యక్షులు చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు జిల్లా అధికార ప్రతినిధి బద్దిపూడి జయరావు, ఎస్సీ సెల్ నాయకులు పల్నాటి చెన్నయ్య, గ్రీవెన్స్ అధ్యక్షులు ఎరమాల నాగభూషణం ,నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తుళ్లూరి ఆదిలక్ష్మి, నియోజకవర్గ అంగన్వాడి విభాగం అధ్యక్షులు దేవరకొండ ఆదిలక్ష్మి,తన్నీరు.ధరణి,లక్ష్మితదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *