google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల మెగా టాక్స్ మేళా’ గోడపత్రికను ఆయన విడుదల చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ఆర్థిక పురోభివృద్ధికి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్ల ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
“మే 31వ తేదీలోపు 2026-27 సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ లభిస్తుంది. ఈ అవకాశాన్ని గృహ యజమానులందరూ సద్వినియోగం చేసుకోవాలి” అని కలెక్టర్ గారు పిలుపునిచ్చారు.
గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అభివృద్ధి పనులు పంచాయతీల ఆదాయంపైనే ఆధారపడి ఉంటాయని, ప్రజలు తమ వంతు బాధ్యతగా పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పన కుమారి, ఐఏఎస్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీ యం. వెంకటేశ్వరరావు గారు, ఇతర జిల్లా స్థాయి అధికారులు, పంచాయతీ రాజ్ సిబ్బంది పాల్గొన్నారు. మే నెల చివరి వరకు ఈ మేళాపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *