మార్కాపురం పట్టణం లో
నేరాలపై విద్యార్థినులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, తమ భద్రత తమ చేతుల్లోనే ఉందని, అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా ఒక్క క్లిక్‌తోనే పోలీసుల సహాయం పొందవచ్చని, అలాగే తమ లొకేషన్‌ను వెంటనే పోలీసులతో పంచుకోవచ్చని మార్కాపురం పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి విద్యార్థునులకు వివరించారు. గురువారం స్థానిక ఇందిరా ఇంజనీరింగ్ కళాశాలలో శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ ఎక్కడైన మహిళలు ఒంటరిగా ఉండి ఇతరులతో ఇబ్బందులు పడే పరిస్థితులు తలెత్తినప్పుడు శక్తి టీమ్‌కు సమాచారం అందించాలన్నారు. ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రతకై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను, శక్తి యాప్‌ గురించి, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. మహిళలు గృహహింసకు గురైనప్పుడు చేయవలసిన చర్యలను ఆయన వివరించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ శంకర్ బాబు మాట్లాడుతూప్రతి మహిళ తమ ఫోన్ లో శక్తి యాప్‌ను డౌనలోడ్‌ చేసుకుంటే ఆపదల సమయంలో పోలీసుల సాయం పొందవచ్చని అన్నారు. హింసాత్మక ఘటనల నుంచి మహిళలు రక్షణ పొందవచ్చని అన్నారు. ఏదైనా ప్రమాదం తలెత్తితే యాప్‌ ఓపెన చేసి ఎస్‌ఓఎస్‌ బటనను నొక్కితే.. బాధితులు ఉన్న లోకొషనను పోలీసులు గుర్తించి, తక్షణమే స్పందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, శక్తి టిమ్ సభ్యులు విద్యార్థునులు పాల్గొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *