తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న దర్శి టీడీపీ ఇంచార్జి డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామం చింతలపాలెంకు చెందిన సిరిశెట్టి రాంబాబు గారికి ₹7,50,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (LOC) చెక్కును గురువారం దర్శిలోని టీడీపీ కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా డా. గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.