తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
బాపట్ల స్కూల్ బస్ లన్నీ ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ టి.కె. పరంధామ రెడ్డి అన్నారు. ట్రాన్స్పోర్ట్ కమీషనర్ ఆదేశాల మేరకు మే 1 వ తారీకు నుంచి స్కూల్ బస్ ల తనిఖీలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ను 3 బృందాలుగా ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టామన్నారు. జిల్లాలో మొత్తం 703 స్కూల్ బస్సులు ఉన్నాయని వాటిలో 655 బస్సులు ఫిట్నెస్ కలిగి ఉన్నాయని, 48 బస్సులకు ఫిట్నెస్ అంతమైందని తెలిపారు. స్కూల్స్ కు వేసవి సెలవులు కారణంగా, స్కూల్స్ ఆవరణ వద్దనే బస్సులను తనిఖీ చేస్తున్నామన్నారు. స్కూల్ యజమానులు , ఆంధ్ర ప్రదేశ్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 లో రూల్ నెం. 185(జి) లో పేర్కొన్న నిబంధనలను మరియు AIS63 లో పేర్కొన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ముఖ్యంగా అత్యవసర ద్వారం సక్రమమైన పద్ధతిలో అమర్చ బడి ఉందా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ పనిచేస్తుందా, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైసెస్ కలిగి ఉన్నాయా అనే అ