తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు కోర్టు గురువారం చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పించింది. గిద్దలూరు కు చెందిన షేక్ అస్మతుని షా వద్దా రాచర్ల మండలానికి చెందిన షేక్ చాంద్ బాషా అప్పుగా నగదు తీసుకొని చెల్లించే క్రమంలో చెల్లని చెక్కు ఇచ్చాడు. బాధితురాలు పలుమార్లు చెక్కు ఇచ్చిన వ్యక్తిని సంప్రదించింది. స్పందన లేకపోవడంతో కోర్టును బాధితురాలు ఆశ్రయించింది. చెల్లని చెక్కు విషయంలో విచారణ జరిపిన న్యాయమూర్తి భరత్ చంద్ర నేరం రుజువు కావడంతో నిందితుడు చాంద్ భాషా కు ఏడాది జైలు శిక్ష విధించడంతో పాటు రూ.4 లక్షలు నగదు బాధితురాలికి చెల్లించాలని న్యాయమూర్తి భరత్ చంద్ర.. నిందితుడిని ఆదేశించారు.