మన ఇంటి నుంచి, మన నగరం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దామని, కాలుష్యాన్ని నివారించి, భావితరాలకు ఆస్తులే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇద్దామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ కవర్లను, వస్తువుల వాడాకానికి దూరంగా ఉండాలని తెలిపారు. ఒంగోలు నగరంలోని కొత్త మార్కెట్ లో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జనార్దన్ పాల్గొని ప్రసంగించారు. ప్రజల ఆరోగ్యానికి మరియు పరిశుభ్రతకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిస్తూ స్వచ్ఛంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్లాస్టిక్ వినియోగంతో అటు ఆరోగ్యం, ఇటు పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులు రాకుండా చేయడంలో మహిళలే కీలకమన్నారు.గత పాలకులు చెత్త మీద పన్ను వేసి, ప్రజలపై ఆర్థిక భారంగా మోపారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేసి, అదే చెత్త ద్వారా సంపద సృష్టిస్తున్నారన్నారు. చెత్తతో వర్మీ కంపోస్ట్, ఇతర సేంద్రీయ ఎరువులను తయారు చేస్తున్నారన్నారు. స్వచ్ఛ రథాల ద్వారా ప్లాస్టిక్, ఇనుము, ఇతర వ్యర్థాలు సేకరించి, ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారన్నారని జనార్దన్ తెలిపారు. ప్రజలంతా ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, గోపాలపురం శాసనసభ్యులు వెంకట రాజు, కమిషనర్ వెంకట కృష్ణయ్య , కూటమి పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నడం జరిగినది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *