జోన్నవాడ శ్రీ మల్లిఖార్జున స్వామి సమేత కామాక్షి తాయీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది.విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నుండి సంప్రదాయ మర్యాదలతో వచ్చిన శాశ్వత సారెను అమ్మవారికి సమర్పించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆలయ వేద పండితుల ఆశీర్వాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అభివృద్ధి కోసం ప్రార్థించాను.జోన్నవాడ క్షేత్ర మహిమ మరింతగా వెలుగొందాలని, అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *