ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడం, రద్దీ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించి అరికట్టడం లక్ష్యంగా జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్ కేంద్రాల్లో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు. ప్రజల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో భద్రతా పర్యవేక్షణను మరింత పెంచుతూ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గుర్తించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి గుర్తింపు పత్రాలు (ID ప్రూఫ్స్) పరిశీలించి భద్రతాపరమైన అంశాలను సమీక్షించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బందికి అవసరమైన సూచనలు జారీ చేస్తూ, రద్దీ ప్రాంతాల్లో నేర నియంత్రణ చర్యలను బలోపేతం చేశారు.ప్రయాణికులు తమ లగేజీ, విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల వద్ద సామాను వదిలిపెట్టవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అనాధ వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్లలో ప్రయాణికుల భద్రత కోసం నిరంతర గస్తీ, తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.ప్రజలు పోలీసు శాఖకు సహకరించి ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే వెంటనే డయల్ 100/112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే సురక్షితమైన ప్రయాణ వాతావరణం, శాంతియుత సమాజం సాధ్యమని పోలీసులు పేర్కొన్నారు.

ప్రయాణికుల భద్రతే లక్ష్యం… రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో ప్రకాశం–మార్కాపురం జిల్లా పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు, భద్రతా పర్యవేక్షణతొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడం, రద్దీ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించి అరికట్టడం లక్ష్యంగా జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్ కేంద్రాల్లో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు. ప్రజల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో భద్రతా పర్యవేక్షణను మరింత పెంచుతూ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గుర్తించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి గుర్తింపు పత్రాలు (ID ప్రూఫ్స్) పరిశీలించి భద్రతాపరమైన అంశాలను సమీక్షించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బందికి అవసరమైన సూచనలు జారీ చేస్తూ, రద్దీ ప్రాంతాల్లో నేర నియంత్రణ చర్యలను బలోపేతం చేశారు.ప్రయాణికులు తమ లగేజీ, విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల వద్ద సామాను వదిలిపెట్టవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అనాధ వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్లలో ప్రయాణికుల భద్రత కోసం నిరంతర గస్తీ, తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.ప్రజలు పోలీసు శాఖకు సహకరించి ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే వెంటనే డయల్ 100/112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే సురక్షితమైన ప్రయాణ వాతావరణం, శాంతియుత సమాజం సాధ్యమని పోలీసులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *