భీమవరం గ్రామ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంపొందించే లక్ష్యంతో “బడిబాట” నూతన విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.భీమవరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మరియు భీమవరం మెయిన్ స్కూల్ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మండల విద్యాశాఖాధికారి పి.వి. రమణయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి బడి వయస్సు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, జగనన్న అమ్మఒడి, విద్యా కానుక వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు.మండల విద్యాశాఖాధికారి పి.వి. రమణయ్య మాట్లాడుతూ, ప్రతి చిన్నారి విద్య హక్కు అని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యతో పాటు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దాలని కోరారు.
ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు, తల్లిదండ్రుల నుండి మంచి స్పందన లభించింది.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బండి సుబ్బరావు , వి. రమేష్,తాటితోటి చంద్రమౌళి,ఉపాధ్యాయినీ నాగమణి, సహా ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *