ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 88 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. సోమవారం ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) కార్యక్రమం నిర్వహించారు.మీకోసం కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుదిక్కుల నుండి వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించి వారితో మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వర పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంభందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, త్వరితగతిన విచారించి చర్యలు తీసుకోని, బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని, సంఘటన స్థలాలను సందర్శించి చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ పి.శ్రీధర్, ఒంగోలు రూరల్ సిఐ శేషగిరి రావు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు, గుడ్లూరు సీఐ నరేష్ కుమార్, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు
