తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం.:-
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) గా పనిచేస్తున్న తంగిరాల దత్త యశ్వంత్ కు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) గా పదోన్నతి లభించింది.ఈ మేరకు రాష్ట్ర హోమ్ శాఖ కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈయన తొలుత చిత్తూరు జిల్లా పుత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ గాను, అనంతరం పుట్టపర్తి, తిరుపతి,జమ్మలమడుగు సబ్ డివిజన్ లలో డిఎస్పీ గా సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వర్తించారు.
అలాగే ఈయన పనిచేసిన అన్ని సబ్ డివిజన్ లు రాయలసీమ ప్రాంతాల్లోనే ఉండడం విశేషం.
ఈయన చిత్తూరు జిల్లాలో పని చేసిన సమయంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం స్మగ్లర్లను సమయ స్పూర్తితో పట్టుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర హోమ్ శాఖ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందాయి.
ఈయన పనిచేసిన అన్ని ఏరియాల్లో ప్రజల నుండి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.అలాగే నిజాయితీ గల అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యాలయంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఈయన సిఎం కార్యాలయంలో సమర్ధవంతంగా బాధ్యతలను నిర్