తొలి శుభోదయం న్యూస్ దోర్నాల :-
యర్రగొండపాలెం నియోజకవర్గ పర్యటనలో భాగంగా దోర్నాల గ్రామంలో రూ.49 లక్షల నిధులతో మొదటి ఫేజ్ లో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్‌కు జిల్లా కలెక్టర్ విజయ సునీత గారు, జిల్లా ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, స్థానిక టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు గార్లతో కలిసి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. రోజుకు 400కు పైగా బస్సులు రాకపోకలు సాగించే దోర్నాలలో ఆధునిక సౌకర్యాలతో బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నాం. శ్రీశైలం వెళ్లే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో గ్రామీణ ప్రాంత మహిళలకు సురక్షిత ప్రయాణ సౌకర్యం అందడమే కాకుండా ఆటో ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో టెంపుల్ టూరిజం అభివృద్ధికి కూడా ఈ పథకం దోహదపడుతోంది. అనంతరం దూపాడు నుంచి దోర్నాల వరకు సాగర్ నీటిని విడుదల చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు పనులను రూ.500 కోట్లతో వేగవంతం చేస్తోంది. త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసి పరిసర ప్రాంత ప్రజలకు త్రాగు, సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోంది.