ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, బక్రీద్ పండుగను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరస్పర సహకారంతో శాంతిభద్రతలను కాపాడాలని పోలీసులు సూచించారు. ప్రత్యేక పర్వదినాల సమయంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తులు మొక్కుబడులు లేదా ఆచారాల పేరుతో గోవధ, జంతు బలులు లేదా ఇతర చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకూడదని స్పష్టంగా తెలియజేశారు.అదేవిధంగా పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరగేందుకు మత పెద్దలు, యువత మరియు స్థానిక కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే సందేశాలను ప్రచారం చేయరాదని హెచ్చరించారు. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు లేదా సమస్యలు తలెత్తిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.ప్రజల సహకారంతో పండుగను సురక్షితంగా, సామరస్యపూర్వకంగా నిర్వహించడం సాధ్యమవుతుందని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *